UPSE: యూపీఎస్‌సీ బిగ్ నోటిఫికేషన్!

యూపీఎస్‌సీ బిగ్ నోటిఫికేషన్!

ఈపీఎఫ్ఓలో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీ

మొత్తం 80 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. సెప్టెంబర్ 11 చివరి తేదీ

మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ (ఆగస్ట్ 26): నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తీపి కబురు అందించింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్’ (EPFO)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 80 గ్రూప్ ‘ఏ’ శాశ్వత పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ‘లెవెల్-10’ పే స్కేల్ అందుతుంది.

ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ లా, లేబర్ లాస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు కాగా.. ఓబీసీలకు 38, ఎస్సీ/ఎస్టీలకు 40, దివ్యాంగులకు 56 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ద్వారా సెప్టెంబర్ 11వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.