AMARAVATHI: కేంద్ర సర్వీసులకు బదిలీ అయిన 2012 బ్యాచ్ ఐఏఎస్ !

ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ ప్రసన్న వెంకటేశ్
కేంద్ర సర్వీసులకు బదిలీ అయిన 2012 బ్యాచ్ ఐఏఎస్
సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఐదేళ్ల కాలపరిమితికి నియామకం

మినిట్ 2 మినిట్, అమరావతి (ఆగస్ట్ 29): ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్‌గా నియమించింది. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఐదేళ్ల కాలపరిమితికి ప్రసన్న వెంకటేష్‌ను ఎన్‌టీఏ డైరెక్టర్‌గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం స్టేట్ సర్వీసుల్లో కొనసాగుతున్న ప్రసన్న వెంకటేష్ త్వరలోనే కేంద్ర డిప్యుటేషన్‌పై ఢిల్లీ వెళ్లీ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా కీలక సేవలు అందించారు.