గన్నేరువరం: చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు అరుకాల శ్యామ్‌కుమార్, పోలవేని మల్లేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్‌కు అందజేశారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసినా తమకు తగిన గుర్తింపు లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం కొందరికే అవకాశాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై, పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సీనియర్ల రాజీనామా స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
TG: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతల రాజీనామా!
