హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గం.. కొత్తపేట-మోహన్‌నగర్‌లో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. ఇక్కడి సర్వే నంబర్ 135లో గల సుమారు 700 గజాల ప్రభుత్వ భూమిని 2007లో చైతన్యపురి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ కేటాయించింది. అయితే, కొందరు కబ్జాదారులు ఆ స్థలాన్ని ఆక్రమించి, గుడిసెలు వేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పోలీసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు, రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఆ ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. అనంతరం ఆ విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ స్థలాన్నే ఆక్రమించడం ఇక్కడ కలకలం రేపింది.
పోలీస్ స్టేషన్ భూమి కబ్జా.. ఆక్రమణలు తొలగించిన హైడ్రా
