అమెరికా చిన్నారులకు మస్క్ మెగా బొనాంజా.. ఒక్కొక్కరికి రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు ఉచితం!

SpaceX Shares

SpaceX Shares

SpaceX Shares:  ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికా చిన్నారులకు భారీ కానుక ప్రకటించారు. అమెరికాలోని 18 ఏళ్ల లోపు ఉన్న ప్రతి చిన్నారికి ఉచితంగా రెండు స్పేస్‌ఎక్స్ షేర్లను అందించనున్నట్లు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. వీటిలో ఒక కొత్త క్లాస్-ఏ షేరును స్పేస్‌ఎక్స్ సంస్థ అందించనుండగా, మరొక షేరును మస్క్ తన వ్యక్తిగత వాటా నుంచి సమానంగా జత చేసి ఇవ్వనున్నారు.

భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం

చిన్నారుల దీర్ఘకాలిక పొదుపు కోసం ఏర్పాటు చేసిన ‘ట్రంప్ అకౌంట్ల’ (Trump Accounts) ద్వారా ఈ షేర్లను బదిలీ చేయనున్నారు. గత నెలలో ఒక్కో చిన్నారికి ఒక షేరు ఇస్తానని చెప్పిన మస్క్, తాజాగా తన హామీని రెట్టింపు చేశారు. దాదాపు 7.2 కోట్ల మంది చిన్నారులకు అందనున్న ఈ షేర్ల మొత్తం విలువ సుమారు 18 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. కంపెనీ ఇచ్చే షేరు వచ్చే నెలలో బదిలీ అవుతుందని, తన లాక్-అప్ పీరియడ్ ముగిసిన తర్వాత 2027 జూన్‌లో తన వ్యక్తిగత షేరును అందిస్తానని మస్క్ స్పష్టం చేశారు. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో నేరుగా ప్రజలను భాగస్వాములను చేయడమే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు