కలెక్టర్‌కే అసభ్య మెసేజ్‌లు.. కటకటాల పాలైన అధికార పార్టీ ఎమ్మెల్యే!

Arul Vignesh

Arul Vignesh

Arul Vignesh:  తమిళనాడు రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపిన కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే అరుళ్‌ విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత హోదాలో ఉన్న ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి పట్ల ప్రజాప్రతినిధి అసభ్యకరంగా ప్రవర్తించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

బాధిత మహిళా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ప్రాథమిక ఆధారాలను సేకరించిన అనంతరం ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడే ఇలాంటి చర్యకు పాల్పడటంపై ప్రతిపక్షాలతో పాటు మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని నిరూపిస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.