మసాపేటలో జోరుగా ‘ఇంటింటికీ టీడీపీ’.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం!

TDP leaders conducting Intintiki TDP program in Masapeta, Kadapa.

మినిట్2మినిట్ న్యూస్ డెస్క్, కడప:
రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిర్వహించారు. జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసుల రెడ్డి ఆదేశాల మేరకు నగరంలోని 26వ డివిజన్ మసాపేట ప్రాంతంలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ టీడీపీ ఇంచార్జ్ చవలముడి శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ పర్యటనలో భాగంగా నాయకులు, కార్యకర్తలు ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. వారి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.

రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం!
టీడీపీ కూటమి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ కాలంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు ప్రజలకు వివరించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు ఆపకుండా పెద్దఎత్తున అమలు చేస్తున్న తీరుపై హర్షం వ్యక్తమైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలన, సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రభుత్వ పనితీరును ప్రజలు స్వయంగా అభినందిస్తూ తమ పూర్తి మద్దతును తెలియజేశారు.

భారీగా పాల్గొన్న టీడీపీ నాయకులు, శ్రేణులు
ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. క్లస్టర్ ఇంచార్జ్ సూర్యనారాయణ, SC సెల్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కొమ్మాలపాటి సుబ్బారాయుడు, మాజీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి స్వర్ణ లక్ష్మీనారాయణ, తెలుగు మహిళ కడప ఉపాధ్యక్షురాలు చవలముడి మౌనిక, జయశ్రీ,, TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మసాపేట శివ, TNSF నగర అధ్యక్షుడు అనిల్, 188 బూత్ ఇంచార్జ్ జనార్ధన్, SC సెల్ నాయకుడు స్టెలస్టిన్, 26వ డివిజన్ టీడీపీ నాయకులు దండు పెద్ద పెంచలయ్య, ఆనంద్, శ్రీకాంత్, చరణ్, స్థానిక కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.