మినిట్ 2 మినిట్, హైదరాబాద్: నగరంలోని రామకృష్ణ మఠం ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ఆధ్వర్యంలో ‘యోగా అధ్యయన శిబిరం’ పేరుతో 5 నెలల ప్రత్యేక సర్టిఫికేట్ కోర్సు నిర్వహిస్తోంది. ఆగస్టు 8 నుంచి జనవరి 2027 వరకు ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం 5:15 నుంచి 7:30 గంటల వరకు ఈ తరగతులు నిర్వహించనున్నారు. ఈ శిక్షణలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో పాటు భగవద్గీత శ్లోకాలు, స్వామి వివేకానంద బోధించిన యోగ సిద్ధాంతాలపై ప్రత్యేక తరగతులు ఉంటాయి. ఆయుర్వేద, హోమియోపతి, అల్లోపతి నిపుణులు కూడా ఉపన్యాసాలు అందిస్తారు. 18 నుంచి 55 ఏళ్ల పురుషులు, మహిళలు అర్హులు. తెల్లటి దుస్తులు ధరించడం తప్పనిసరి. ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం 9177232696 నంబరులో గానీ, www.vihehyd.org వెబ్సైట్లో గానీ సంప్రదించవచ్చు.
HEALTH& EDUCATION : రామకృష్ణమఠంలో ‘యోగా అధ్యయన శిబిరం’ కోర్సు!
