వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచే పోటీ చేస్తా
తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన
తాతముత్తాతల అడ్డా ఆలేరన్న టీఆర్పీ చీఫ్!
మినిట్ 2 మినిట్, యాదాద్రి భువనగిరి (ఆగస్ట్ 25): రాబోయే శాసనసభ ఎన్నికల్లో తాను ఆలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేయబోతున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. హైదరాబాద్లో జెన్ జీ (Gen Z) యువతతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సొంత ఓటు హక్కు ఆలేరులోనే ఉందని, అది తన తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న ప్రాంతమని ఆయన గుర్తుచేశారు. ప్రజల తరఫున నిలబడి పోరాడేందుకు ఆలేరు నియోజకవర్గాన్నే తన రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్నట్లు ప్రకటించారు. తీన్మార్ మల్లన్న చేసిన ఈ తాజా ప్రకటనతో ఆలేరు స్థానిక రాజకీయాల్లో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోగా, వాతావరణం తీవ్ర కాకరేపుతోంది.
