మినిట్2మినిట్ డెస్క్, ఎల్‌బీ నగర్: స్థానిక మెట్రో స్టేషన్ సమీపంలోని ప్రసిద్ధ శ్రీ మాల్ మైసమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధిలో మైలాపురం కుటుంబం భాగస్వామ్యమైంది. దివంగత మైలాపురం నారాయణ శెట్టి జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ఆలయానికి ఆర్‌సీసీ (RCC) షెడ్, ఎయిర్ కండీషనర్ (AC) సౌకర్యంతో పాటు అవసరమైన మరమ్మత్తు పనులను ప్రారంభించారు.తమకు ఈ పుణ్యకార్యంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పించిన ఆలయ చైర్మన్ గుంటి లక్ష్మణ్‌కు మైలాపురం కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు సంపత్ కుమార్. అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
LB Nagar: ఎల్‌బీ నగర్ మాల్ మైసమ్మ ఆలయ అభివృద్ధికి మైలాపురం కుటుంబం విరాళం
