Chittoor: చిత్తూరు చెరువుల్లో దోమల నివారణకు డ్రోన్ల వినియోగం

drone mosquito spray in chittoor

మినిట్2మినిట్ డెస్క్: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చిత్తూరు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నగరంలోని పలు డివిజన్లలోని చెరువులలో దోమల నివారణకు అత్యాధునిక డ్రోన్ ద్వారా బీటీ (BT) స్ప్రేను విజయవంతంగా నిర్వహించారు. గంటల కొద్దీ పట్టే పనిని డ్రోన్ సాయంతో కేవలం కొద్ది నిమిషాల్లోనే అత్యంత సమర్థవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించారు. ఆయన దగ్గరుండి డ్రోన్ ద్వారా కెమికల్ స్ప్రే చేసే ప్రక్రియను నిర్వహించడమే కాకుండా, మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి సాంకేతికత పనితీరు, దాని ప్రభావంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు ఇలాంటి టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్స్ ఎంతో ఉపయోగపడతాయని ఆయన కొనియాడారు.