మినిట్2మినిట్ డెస్క్, హైదరాబాద్: నగరంలోని దోమల్‌గూడలో ఉన్న రామకృష్ణ మఠం వేదికగా ఈ నెల 26న ‘ప్రత్యేక ఆధ్యాత్మిక సదస్సు’ (Special Spiritual Retreat) అత్యంత వైభవంగా జరగనుంది. రామకృష్ణ మఠం అంతర్జాతీయ అధ్యక్షులు, పూజ్య సంఘ గురువులు స్వామి గౌతమానందాజీ మహరాజ్ దివ్య సమక్షంలో ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ప్రముఖ హిందుస్తానీ సంగీత విద్వాంసులు పండిట్ దత్తాత్రేయ వేలాంకర్ ఆలపించే భక్తిరంజక భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే పూజ్య ప్రెసిడెంట్ మహరాజ్ చేతుల మీదుగా నూతన పుస్తక ఆవిష్కరణతో పాటు సరికొత్త ‘ఏఐ (AI) వీడియో’ విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 100/- గా నిర్ణయించారు. ఆసక్తి గల భక్తులు మఠం కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని, భక్తులందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానమని మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద ఒక ప్రకటనలో తెలిపారు.
RK Math: రామకృష్ణ మఠంలో జులై 26న ‘ప్రత్యేక ఆధ్యాత్మిక సదస్సు’
