టీజీపీఎస్సీ అభ్యర్థులకు ఊరట.. సిలబస్ మార్పులపై కమిషన్ క్లారిటీ!

TGPSC Syllabus

TGPSC Syllabus

TGPSC Syllabus: తెలంగాణలో వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సిలబస్ మార్పులపై సాగుతున్న ప్రచారానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెరదించింది. పాఠ్యాంశాల సవరణకు సంబంధించి అభ్యర్థుల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో కమిషన్ సెక్రటరీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతానికి సిలబస్‌లో మార్పులు చేయడానికి ఎలాంటి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయలేదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఉద్యోగ సన్నాహకాలకు ఇబ్బంది కలగకుండా ప్రధాన మార్పులు ఏవైనా ప్రతిపాదిస్తే, వాటిని పరీక్షకు కనీసం ఒక సంవత్సరం ముందే అభ్యర్థులకు స్పష్టంగా తెలియజేస్తామని వెల్లడించారు.

అలాగే చిన్నపాటి స్వల్ప మార్పులు మాత్రమే ఉంటే, సదరు ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ ఇచ్చే సమయంలోనే వివరాలను వెల్లడిస్తామని వివరించారు. దీంతో సిలబస్ మార్పులపై నిరుద్యోగుల్లో ఉన్న అనిశ్చితికి ముగింపు పడింది.