జెన్ జీ బాటలోనే జెన్ ఆల్ఫా కూడా!
అధికారులను పరుగులెత్తించిన చిన్నారుల గ్రౌండ్ రిపోర్ట్!
రాజకీయ నాయకుల నిద్రమత్తు వదిలించిన వీడియో
స్మార్ట్ ఫోన్‌తో మార్పు తీసుకురావొచ్చని నిరూపించిన ఘటన
అంగాంగ ప్రదర్శన చేసే ముద్దుగుమ్మల కంటే ఈ పిల్లలు కోట్ల రెట్లు బెటర్
స్పందించే సత్తా ఉంటే, మీ ఫోన్ ఓ సరికొత్త మార్పునకు నాంది
సిటిజన్ జర్నలిజం అనేది ఈ దేశానికి ఎంతో అవసరం
మినిట్ 2 మినిట్, ట్రెండింగ్ టాపిక్: గొడుగునే మైకుగా మార్చుకుని, స్మార్ట్‌ఫోన్‌తోనే ప్రభుత్వాన్ని నిలదీశారు ఈ చిన్నారులు! రాజకీయ నాయకుల అలసత్వాన్ని, అధికారుల నిద్రమత్తును వదిలించిన ఆ ‘గ్రౌండ్ రిపోర్ట్’ ఇప్పుడు దేశానికే దిశానిర్దేశం చేస్తోంది. మౌలిక వసతుల లేమితో, నిత్యం గుంతల రోడ్డుపై నరకం చూస్తున్న గ్రామీణ విద్యార్థినులు కేవలం బాధపడి ఊరుకోలేదు. రాయగఢ్ జిల్లా కర్జత్ సమీపంలో జరిగిన ఈ ఘటన నేటి డిజిటల్ తరానికి సరికొత్త పాఠం నేర్పుతోంది. రీల్స్, వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కే ఈ రోజుల్లో.. తమ ఊరి రోడ్డు బాగుపడాలనే తపనతో ఆ చిన్నారులు చేసిన స్మార్ట్ రిపోర్టింగ్ సామాజిక మాధ్యమాల్లో వ్యాపించి, రాత్రికి రాత్రే అధికారులను పరుగులు తీయించింది. యంత్రాలు దిగాయి, రోడ్డు రూపురేఖలు మారాయి!
ప్రశ్నించే గొంతుకకు వయసుతో పనిలేదు!
‘జెన్ జీ’ల ఉద్యమాన్ని చూసిన ‘జెన్ ఆల్ఫా’ చిన్నారులు కూడా రంగంలోకి దిగారు. అనవసర రాజకీయ వివాదాలతో, వ్యక్తిగత విమర్శలతో బట్టలు చింపుకునే నాయకుల కంటే.. చేతిలో ఫోన్ ఉంది కదా అని బట్టలిప్పుకుని తిరిగే సుందరీమణుల కంటే, తమ సమస్యను ప్రపంచం ముందుంచి పరిష్కారం సాధించిన ఈ పిల్లలు కోట్ల రెట్లు ఉత్తములు.
ప్రతి స్మార్ట్‌ఫోన్.. ఓ న్యూస్ ఛానలే!
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి పౌరుడూ ఒక రిపోర్టరే! వ్యవస్థలో లోపాలను ప్రశ్నించడానికి, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు మీడియా ప్రతినిధులే రానవసరం లేదు. మన చేతిలో ఉన్న సాంకేతికతను సామాజిక బాధ్యతతో ఉపయోగిస్తే ఎంతటి గొప్ప మార్పైనా సాధ్యమేనని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. చిన్నారుల వీడియో దేశవ్యాప్తంగా ఒక కొత్త సంచలనానికి తెరలేపింది. మౌలిక వసతులు లేక నరకం అనుభవిస్తున్న అనేక గ్రామాల్లోని ప్రజలకు ఇది ఒక దిశానిర్దేశం. ప్రతీ పౌరుడూ ఒక రిపోర్టరే అని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును సరిగ్గా ఉపయోగిస్తే పరిష్కారం ఖాయమని ఈ పిల్లలు నిరూపించారు. చిన్న పిల్లలే కదా అని తేలిగ్గా తీసిపారేస్తే పొరపాటే! రేపటి పౌరులుగా వారు నేడు వేస్తున్న అడుగులు, రేపటి భారతాన్ని సరికొత్తగా నిర్మించబోతున్నాయి. మార్పు కోసం ఎదురుచూడటం కాదు.. ఆ మార్పునకు మనమే శ్రీకారం చుట్టాలి!” ఈ చిన్నారుల పోరాటం కేవలం ఒక్క రోడ్డు నిర్మాణంతో ఆగిపోదు. దేశవ్యాప్తంగా మూలనపడ్డ గ్రామాల్లో, ప్రజా సమస్యలతో నలిగిపోతున్న వేలాది ప్రాంతాల్లో కొత్త చైతన్యానికి ఇది నాంది కాబోతోంది. మార్పు కోసం శ్రమిస్తున్న ఈ రేపటి పౌరులకు శిరస్సు వంచి నమస్కరిద్దాం! ఈ సందేశాన్ని నలుగురితో పంచుకోండి.. సమాజంలో మార్పునకు భాగస్వాములు అవ్వండి!
