ఇవి ఎన్నికలా.. ముందే చేసుకున్న సెలక్షన్లా? కూటమి అక్రమాలపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్!

Jagan Slams

Jagan Slams

Jagan Slams: రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికార టీడీపీ నేతలు దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇవి ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్నికలా లేక ముందే నిర్ణయించుకున్న సెలక్షన్లా అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.

ప్రస్తుతం జరుగుతున్న పోలింగ్ తీరును ఏమాత్రం ఎన్నికలని అనలేమని నిలదీశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను అధికార యంత్రాంగం, కూటమి నేతలు కబ్జా చేశారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని మండిపడ్డారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ ఇలాంటి అక్రమ ఎన్నికలు జరగలేదని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైనందునే కూటమి ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు తెగబడుతోందని విమర్శించారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే వ్యవస్థలన్నింటినీ హైజాక్ చేశారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా సైతం అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పోలింగ్ కేంద్రాల్లో కూటమి నాయకులు బహిరంగంగా రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోకుండా కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.