బాచుపల్లి విషవాయువుల మృతుల కుటుంబాలకు భారీ ఊరట.. రంగంలోకి దిగిన జాతీయ కమిషన్!

Bachupally Tragedy

Bachupally Tragedy

Bachupally Tragedy: బాచుపల్లి మండలంలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్ ఎస్టీపీ ట్యాంక్‌లో విషవాయువులు పీల్చి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటనపై జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ సభ్యుడు కరమ్ సింగ్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, డీసీపీ కోటిరెడ్డితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి:

ఆధునిక కాలంలో ఎంతో టెక్నాలజీ అందుబాటులో ఉండగా, మనుషులతో చేయించకూడని ప్రమాదకర పనులను చేయించడం తీవ్రమైన నేరమని కరమ్ సింగ్ మండిపడ్డారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం అందించడంతో పాటు, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.