Media Launch: నిష్పక్షపాత జర్నలిజానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తున్న ‘మినిట్ 2 మినిట్’ దినపత్రిక, ‘మీడియా పోస్టర్ న్యూస్’ ఛానల్ నూతన కార్యాలయం గురువారం ఎల్బీ నగర్లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, పాత్రికేయుల సమక్షంలో ఈ సరికొత్త మీడియా కేంద్రానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. ప్రజా గొంతుకను మరింత బలంగా వినిపించే లక్ష్యంతో ఈ నూతన కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
సామాన్యుడి గళం ప్రతిధ్వనించాలి
ఈ సందర్భంగా కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పలువురు ప్రముఖులు, ఆత్మీయులు సంస్థ ప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యుడి కలం, గళం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలని, నిజాయితీతో కూడిన వార్తలతో ప్రజల మన్ననలు పొందుతూ ఈ సంస్థలు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. డిజిటల్, ప్రింట్ మీడియా రంగాల్లో విలువలతో కూడిన జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లాలని అభినందించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ వేడుకలో ‘మినిట్ 2 మినిట్’ ఫౌండర్ అండ్ చీఫ్ ఎడిటర్ గట్టిమి సతీశ్ నాయుడు, ‘మీడియా పోస్టర్ న్యూస్’ ఛైర్మన్ వరప్రసాద్ మేడి, ‘మినిట్ 2 మినిట్’ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ పూరి, అసోసియేట్ ఎడిటర్ వట్టిపల్లి ప్రకాశ్ శర్మ, సీఓఓ పవన్ కుమార్ రెడ్డి అతిథులకు స్వాగతం పలికారు.
కార్యక్రమంలో టీపీసీసీ డాక్టర్స్ సెల్ – మెడికల్ & హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎం. రాజీవ్, టీఎక్స్ హాస్పిటల్స్ బయో మెడికల్ హెడ్ రాజేశ్ వర్మ, కేకేసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తుమ్మ రాజశేఖర్ రెడ్డి(టీఆర్ఆర్), జిలానీ, మున్నా, తల్వార్ తాత, శ్రీశైలం యాదవ్, గణేశ్, రాకేశ్ రెడ్డి, షఫీ, చిక్కులపల్లి యాదగిరి, నకరికంటి శ్రీకాంత్, సతీశ్, సురేశ్, సలీం, గంట శ్రవణ్ కుమార్, ఇరిగి రమేశ్, సీనియర్ జర్నలిస్టులు రవి గౌడ్, పాపారావు, డి. రమేశ్, అన్వేష్‌తో పాటు పలువురు ఆత్మీయులు, వివిధ ప్రాంతాల రిపోర్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. నూతన కార్యాలయ ప్రారంభం సందర్భంగా సంస్థ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
