టాటా గ్రూప్‌కు చంద్రశేఖరన్ రాజీనామా!
పదవీ కాలం మరో ఏడాది ఉండగానే సంచలన నిర్ణయం
మినిట్ 2 మినిట్, ముంబై(ఆగస్ట్ 13): సుమారు 9 ఏళ్లుగా టాటా గ్రూప్‌ను నడిపిస్తున్న ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం వ్యాపార రంగంలో సంచలనం సృష్టించింది. ఆయన పదవీ కాలం ఫిబ్రవరి 2027 వరకు ఉన్నప్పటికీ, గడువు కంటే ముందే వైదొలిగారు. ఆగస్టు 18న జరగాల్సిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి (AGM) కొన్ని రోజుల ముందు ఈ నిర్ణయం వెలువడింది.
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటాతో ఉన్న వ్యూహాత్మక వైరుధ్యాలే ఈ రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. టాటా న్యూ సూపర్ యాప్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం ఈ విభేదాలను పెంచాయి. చంద్రశేఖరన్ రాజీనామా వార్తతో టీసీఎస్, టాటా మోటార్స్, టాటా పవర్ షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
